GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:19 pm Posted by : GURU SWAMY

ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవాలు

పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులనుఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ప్రారంభించారు. లింగాపురం పంచాయతీ పరిధిలోని రేకులకుంటలో రూ. 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, తులసమ్మ గుడి నందు రూ.3 లక్షల సీసి రోడ్డు, నిడి గుంట నుంచి జోగిండ్లు వరకు రూ. 6 లక్షలతో వేసిన సీసి రోడ్డు, మదనపల్లి రోడ్డు నుంచి దాశనం పల్లె వరకు రూ. 1.12 కోట్లతో ఏర్పాటు చేసిన రోడ్డును, ముత్తుకూరు నందు రూ. 1.47 కోట్లతో నిర్మించిన రోడ్డును, మిట్టపల్లిలో రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన సిసి రోడ్డును, అదే విధంగా కరసన పల్లిలో రూ. 14.30 లక్షలతో నిర్మించిన డ్రైన్ ను ఆయన ప్రారంభించారు.