GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:27 pm Posted by : GURU SWAMY

ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డికి స్వాగతం పలికిన టిడిపి బీసీ సెల్ నేత

తిరుపతి, జూన్ 20 :
తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, టిడిపి నేతలకు ఏర్పేడ్ లో శనివారం టిడిపి బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి, బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత బొడుగు మునిరాజ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
శ్రీవారికి మ్రొక్కులు చెల్లించేందుకు స్వగ్రామమైన ఊరందురు నుండి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, తమ అనుచరులతో పార్టీ నాయకులు కార్యకర్తలతో కాలినడకన తిరుమల కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఏర్పేడు మండల కేంద్రంలో బీసీ సెల్ నేత బొడుగు
మునిరాజా యాదవ్ తో పాటు తిరుపతి పార్లమెంట్ టిడిపి కార్యదర్శి గాలి కృష్ణవేణి, మండల టిడిపి నాయకులు కేశినేని సుబ్రహ్మణ్యం, కేకే రమణ,
గుణ యాదవ్, రాయపునేని రవి నాయుడు, టీడీపీ యూనిట్ ఇంచార్జిలు, పార్టీ కార్యకర్తలు శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆమె ప్రయాణంలో ఎక్కడ ఆటంకాలు కలగకుండా విజయవంతంగా స్వామివారి దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ముని రాజా యాదవ్ తెలిపారు.