ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడు ఐదేళ్లు జైలు శిక్ష
గరుడధాత్రి :
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు తిరువల్లూరు జిల్లా అత్తంతాగేలికి చెందిన నిందితుడు
అరుముగంకు(56) ఐదేండ్లు కఠిన కారాగార శిక్ష, మూడు లక్షల రూపాయలు జరిమాన విధిస్తూ తిరుపతి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు విలువరించినట్టు స్థానిక ఫారెస్ట్ రేంజర్ త్రినాధ్ రెడ్డి పేర్కొన్నారు.
సత్యవేడు రేంజ్ పరిధిలో 2016 సంవత్సరంలో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఈ మేరకు తీర్పు వెలువడింది.సత్యవేడు అటవీ శాఖ పరిధిలో 2016 ఆగస్టు 28వ తేదీన జంబుకేశ్వరపురం-రాజగుంట ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన అరుముగం అనే వ్యక్తిని టాటా వాహనంతో పట్టుకున్నారు.
❄వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని వాటి బరువు సుమారు 792 కిలోలుగా నమోదు చేయడంతో పాటు దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది.తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరిగింది.విచారణ పూర్తికాగానే ఎర్రచందనం దుంగలను నిందితుడు అరుముగం అక్రమంగా రవాణా చేసినట్టు దోషిగా తేలడంతో ప్రత్యేక న్యాయస్థానం ఐదు సంవత్సరాల కఠినకారాలు శిక్ష విధిస్తూ మూడు లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణా,అటవీ నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా అటవీ ఫారెస్ట్ రేంజర్ త్రినాద్ రెడ్డి హెచ్చరించారు.అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా సహకరించాలని,ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వెంటనే సమాచారం అందించాలన్నారు.