GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 8:02 pm Posted by : GARUDA DHATRI NEWS

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు జైలు శిక్ష.

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు జైలు శిక్ష.

– ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు తీర్పుతో నిందితులకు రెండేళ్ల కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా.

– గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా నేరం రుజువు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు.

– అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారి హెచ్చరిక.

తిరుపతి జిల్లా : 2014 సంవత్సరంలో యర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి రవాణా చేస్తున్న నిందితులను అప్పటి యర్రావారిపాలెం ఎస్ఐ శ్రీ ఎస్. రహీముల్లా మరియు సిబ్బంది అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నరసింహమూర్తి గారు ఇద్దరు నిందితులకు రెండేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

– ఈ కేసులో శిక్ష పడిన నిందితులు:

– ఎస్. చలపతి (57), తండ్రి: ఎస్. వెంకటస్వామి, పి. వడ్డిపల్లి హెచ్/ఓ బోడెవండ్లపల్లి, యర్రావారిపాలెం మండలం.

– బి. సుబ్రహ్మణ్యం (33), తండ్రి: బి. జయన్న, ఓఎస్ గొల్లపల్లి గ్రామం, హెచ్/ఓ యల్లమంద, యర్రావారిపాలెం మండలం, తిరుపతి జిల్లా.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో అమలు చేస్తున్న “గుడ్ ట్రయల్ మానిటరింగ్” వ్యవస్థ ద్వారా కేసు పటిష్టంగా నడిపించడంతో నేరం రుజువై ఈ తీర్పు వెలువడింది. కాగా, నిందితులు కోర్టుకు గైర్హాజరు కావడంతో గౌరవ న్యాయమూర్తి వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs) జారీ చేశారు. అనంతరం వారు 18-05-2026న కోర్టులో లొంగిపోగా, 21-05-2026 వరకు రిమాండ్ విధించారు. ఈరోజు కోర్టులో హాజరు పరచగా పై శిక్షను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, ఈ తీర్పు చట్టాన్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం. జిల్లాలో అటవీ సంపదను రక్షించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై మా ఉక్కుపాదం నిరంతరం కొనసాగుతుంది” అని హెచ్చరించారు.
ఈ కేసు దర్యాప్తు, పర్యవేక్షణ, కోర్టు లైజనింగ్‌లో కృషి చేసిన చంద్రగిరి డీఎస్పీ శ్రీ బేతపూడి ప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఏ. అమరనారాయణ, అప్పటి యర్రావారిపాలెం ఎస్ఐ శ్రీ రహీముల్లా, ప్రస్తుత భాకరాపేట సీఐ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఐ బి.వి. లోకేష్, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్, యర్రావారిపాలెం కోర్టు కానిస్టేబుల్ శ్రీ కె. శివ గారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసు అధికారుల సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. అక్రమ రవాణాపై పోరాటాన్ని జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తారు. ప్రజలు కూడా సహకరించాలి” అని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.