ఎర్ర బాడ్జీలతో ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా
ఎర్ర బాడ్జీలతో ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా గరుడధాత్రి న్యూస్ : ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 16,17 తేదీలలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉద్యోగులు ఎర్ర బాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం డిపో కార్యదర్శి ఎస్. మధుబాబు ఆధ్వర్యంలో డిపో గేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు....