GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:22 am Digital Edition : GURU SWAMY

ఎల్‌నినో పై రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించండి

చౌడేపల్లి ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచనలు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ తెలియజేశారు . ఈ సందర్భంగా దుర్గ సముద్రం పంచాయతీలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చునని తెలియజేశారు పంటల సాగు తదితర విషయాలపై అవగాహన కల్పించారు.
డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించి నీటిని ఆదా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ పాల్గొన్నారు.