ఎల్‌నినో పై రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించండి

చౌడేపల్లి ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచనలు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ తెలియజేశారు . ఈ సందర్భంగా దుర్గ సముద్రం పంచాయతీలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చునని తెలియజేశారు పంటల సాగు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ...