– భీముని చెరువు ఎల్లమ్మ తిరునాళ్లులో ఎమ్మెల్యే ఆదిమూలం
– ఎల్లమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
– తిరుణాలలో ప్రత్యేక ఆకర్షణగా జడ్పిటిసి కోనేటి సుమన్
నారాయణ వనం మే 31 గరుడ దాత్రి న్యూస్
ఎల్లమ్మ తల్లి నియోజక వర్గంలోని ప్రజలందరిని చల్లంగా చూడాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేడుకున్నారు.నారాయణవనం మండలం లో తన స్వగ్రామమైన భీముని చెరువు నందు ఎల్లమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఆదివారం సాయంత్రం దీక్షాపరులు అగ్నిగుండం ప్రవేశం ను పురస్కరించుకొని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ తో కలిసి ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమంలో అంతా తానై పర్యవేక్షిస్తూ జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి ఏట ప్రశాంత వాతావరణంలో ఎల్లమ్మ తిరునాళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో కంకణం ధరించి ఆదివారం సాయంత్రం అగ్నిగుండం ప్రవేశం చేస్తారన్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులన్నీ నిండి అన్నదాత ఇంట ఆనందం వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.అనంతరం దీక్షాపరులు గోవింద నామస్మరణతో అగ్నిగుండం ప్రవేశం చేశారు.అగ్నిగుండం ప్రవేశం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు షణ్ముగం, లోకనాథం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్, ఆర్ డి ఏకాంబరం, మాణిక్య రెడ్డి, ధర్మలింగం, మోహిద్దీన్, ఆరుముగం, చిన్నదొరై, కే బాబు, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు.