GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:21 am Digital Edition : GURU SWAMY

ఎల్ నినో ” ప్రభావం నుండి పంటలను కాపాడుకుందాం

కార్వేటినగరం ఆగస్టు 5 (గరుడ దాద్రి న్యూస్);

ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, జిల్లా ఏరువాక కేంద్రం, చిత్తూరు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కో-ఆర్డినేటర్, డా. ఎ. రామకృష్ణా రావ్, వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, పుంగనూరు, డా. జి. కృష్ణారెడ్డి, ఎస్. వి. వ్యవసాయ కళాశాల, తిరుపతి, విద్యార్థిని- విద్యార్థులు మరియు బోధన సిబ్బంది,జ్యోత్స్నా, రాస్ కె.వి.కె, శాస్త్రవేత్త, పి. ఎస్. సుధాకర్ మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు, డి. ఉమ, మండల వ్యవసాయ అధికారి, కార్వేటి నగరం, హేమలత సంయుక్తంగా కలిసి ‘ కార్వేటి నగరం’ ‘మండలంలోని ‘ కార్వేటి నగరం’ గ్రామంలో ఎల్ నీనో ‘ ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులలో పంటల పరిస్థితి తెలుసుకోవడానికి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.డా. ఎ.రామకృష్ణా రావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మాట్లాడుతూ:
*”ఎల్ నినో ” ప్రభావం వల్ల వ్యవసాయ పంటలను ఎలా సంరక్షించుకోవాలి, వర్షాభావ పరిస్థితులలో పంటలను ఎలా పరిరక్షణ చేసుకోవాలో రైతులకు వివ రంగా వివరించడం జరిగింది.ప్రస్తుత పంటలు వాడిపోతున్నట్లయితే యూరియా 2% ( 20 గ్రా/ లీ. నీటికి లేదా 19:19:19 లేదా 20:20:20: 5 గ్రా / లీ. నీ లేదా నీటిలో కరిగే ఎరువు @ 1% (లీటరు నీటికి 10 గ్రాములు) ఒత్తిడి సమయంలో పిచికారీ చేయాలి.వర్షాలు ఆలస్యమైతే వరికి బదులుగా రాగి, సజ్జలు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి వర్షం వచ్చిన వెంటనే విత్తేలా విత్తనాలను ముందుగానే సిద్ధం నేలలో తేమ నిల్వ ఉండేలా మల్చింగ్ (పంట అవశేషాలు లేదా ప్లాస్టిక్ మల్చ్) చేయాలి. కలుపు మొక్కలను తొలగించి నేల తేమను సంరక్షించాలి.
అవసరమైనప్పుడు మాత్రమే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ద్వారా నీటిని అందించాలి.
వర్షపు నీటిని చె

ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతల్లో నిల్వ చేయాలి.
* సమతుల్య ఎరువుల వాడకం పాటించి, సేంద్రియ ఎరువులు ఉపయోగించడం ద్వారా నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
ఉద్యాన పంటల లో
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వినియోగించాలి. చెట్ల చుట్టూ కొబ్బరి పీచు, ఎండిన ఆకులు లేదా గడ్డి పరచి మల్చింగ్ చేయాలి. తీవ్రమైన ఎండ సమయంలో 3% కయోలిన్ (Kaolin) ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల ఆకుల ఉష్ణోగ్రత తగ్గి నీటి నష్టం తగ్గుతుంది.
* అవసరాన్ని బట్టి 1% పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 లేదా 20:20:20 @10 గ్రా/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
* తోటల్లో వర్షపు నీరు నిల్వ చేసుకునే నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి.
* పంటలకు తగిన మోతాదులో పొటాష్ ఎరువులను ఇవ్వాలి (ఉష్ణాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది).
* పశువుల ఎరువు/సేంద్రీయ ఎరువులు వేయడం ద్వారా నేల తేమ నిల్వ మెరుగుపడుతుంది.
* కూరగాయల పంటలకు తాత్కాలిక షేడ్ నెట్ (35–50%) ఏర్పాటు చేయాలి.
* కాయలు మరియు పండ్లు వడ దెబ్బ తగలకుండా ‘కేవోలిన్ 5% (లీటరు నీటికి 50 గ్రా) పిచికారీ చేసుకోవలెను.
* కాయలు రాలిపోకుండా ఉండడానికి గాను ‘పోటాషియం నైట్రేట్’ (KNO₃) 1% (లీటరు నీటికి 10 గ్రా) పిచికారి చేసుకోవలెను.
* చెట్టు అడుగుభాగంలో 10–15 సెం.మీ. మందంతో మల్చింగ్ వేయాలి.
* మధ్యాహ్నం వేళల్లో పురుగుమందులు పిచికారీ చేయరాదు.
* అధిక వేడి సమయంలో ఎరువులు వేయరాదు.
* ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పురుగుమందులు పిచికారీ చేయరాదు.
* అధిక వేడిలో రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, పచ్చ దోమ, తెల్ల దోమ, పిండి నల్లి, పేను బంక మరియు నల్లి పురుగులు ఉదృతి ఎక్కువగా ఆశించి నష్టం కలుగ చేయడానికి అవకాశం వుంది.
* కావున రైతులు రసం పీల్చే పురుగులు నివారణ కోసం పురుగులు మందులు పిచికారి చేయకుండా ప్రత్యమ్నాయంగా ‘ పసుపు రంగు జిగురు అట్టలు, నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి 25 నుండీ 50 వరకు పెట్టుకోవాలి.