ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సత్యవేడు మండల తహసీల్దార్ మరియు ఎన్నికల నమోదు అధికారికి సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఎం. రమేష్ మరియు నాయకుడు తిరుమలరెడ్డి వినతిపత్రం సమర్పించారు.
ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పేర్లు తొలగించే ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.
అలాగే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని, ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ఎన్నికల యంత్రాంగం బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.