ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించవద్దు సీపీఎం నాయకులు తిరుపతి ఆర్డీవోకు వినతిపత్రం
తిరుపతి, జూన్ 20: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయ చంద్ర, తిరుపతి రూరల్ కార్యదర్శి కే సుమన్ నాయకులు చిన్నబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు....