ఏఎం పురం బస్టాప్ వద్ద గుంతలు పూడ్చివేత
గరుడధాత్రి :
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అలివేలు మంగాపురం( ఏఎం పురం) బస్టాప్ వద్ద ఏర్పడిన పలు గుంతలను స్థానిక టిడిపి నాయకులు పూడ్చి వేశారు. వి ఆర్ కండ్రిగ టు టిపి పాలెం మెయిన్ రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది.
ఈనేపథ్యంలో ఏయం పురం బస్టాప్ వద్ద బావులను తలపించే గుంతలు ఏర్పడ్డాయి.వాహనాలు గ్రామంలో ఒక వేళాలన్న, ప్రయాణికులు బస్సు ఎక్కడానికి ఇక్కడ వేచి ఉండాలన్న ఇబ్బందులు తప్పని స్థితి ఏర్పడింది.ఈ మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణానికి ప్రజా ప్రతినిధి భూమి పూజ చేసి రెండు నెలలు పూర్తిగా వస్తున్న రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
దీంతో ఏఎం పురం టిడిపి నాయకులు గోపిరెడ్డి,కోటి తదితరులు వారి సొంత ప్రోక్లైన్ వాహనంతో శుక్రవారం బస్టాప్ వద్ద ఏర్పడిన గుంతలను పూడ్చి చదును చేయడంతో వాహనదారులకు ప్రయాణికులకు కొంతవరకు ఇబ్బందులు తప్పింది.