GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:19 pm Digital Edition : GURU SWAMY

ఏఎస్ఐ షణ్ముగంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ, సిబ్బంది

నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ షణ్ముగం కు మంగళవారం ఎస్ఐ సునీల్ మరియు సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో ప్రజలకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించిన షణ్ముగం గారు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని అందరూ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సహచరులు ఆయన సేవలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ఉద్యోగ పరంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు