ఏడేళ్ల క్రితం తండ్రి హత్య కేసు.. కొడుకు, కూతురుకు ఉరిశిక్ష – భార్యకు జీవిత ఖైదు
-మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు హైదరాబాద్/మేడ్చల్, జూన్ 9: ఏడేళ్ల క్రితం హైదరాబాద్ మౌలాలీలో జరిగిన అత్యంత దారుణ తండ్రి హత్య కేసులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కన్నతండ్రిని విషప్రయోగం చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో దాచిపెట్టిన కేసులో కొడుకు, కూతురుకు ఉరిశిక్ష విధించింది. హత్య కుట్రలో పాలుపంచుకున్న భార్యకు జీవిత ఖైదు ఖరారు చేసింది. మేడ్చల్–మల్కాజిగిరి ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి వి. బాల...