ఏపీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేంద్ర ప్రభుత్వం ₹16,627 కోట్ల 16వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది.ఇందులో బేసిక్ గ్రాంట్ కింద ₹13,302 కోట్లు, పనితీరు ఆధారిత గ్రాంట్ కింద ₹3,225 కోట్లు లభించునున్నాయి.2026-27 నుండి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి ఈ నిధులు విడుదల కానున్నాయి. గత 15వ ఆర్థిక సంఘం కేటాయించిన ₹12,800 కోట్లతో పోలిస్తే ఈసారి నిధులు భారీగా పెరగడం గమనార్హం.