ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించే దిశగా అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం...