ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై మండల స్థాయి అవగాహన సమావేశం

కార్వేటినగరం, ఆగస్టు 7 (గరుడ దాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నమోదును విజయవంతంగా నిర్వహించేందుకు మండల విద్యాశాఖ అధికారుల అధ్యక్షతన మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ , మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యకు దూరమైన వారు, పాఠశాల మానేసిన విద్యార్థులు, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా మరో అవకాశం లభిస్తుందని...