ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడిగా బి. రవి నియామకం
*తిరుపతి న్యాయవాది బి. రవికి కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు* *35 ఏళ్ల సేవలకు దక్కిన గుర్తింపు.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్న సీనియర్ న్యాయవాది.* *తిరుపతి, జూలై 20 (కాకతీయ ప్రతినిధి):* ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, మరియు ఆర్టిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తిరుపతికి చెందిన సీనియర్ న్యాయవాది బి. రవి నియమితులయ్యారు. ఈ మేరకు 12 మంది ప్రతినిధులతో కూడిన నూతన రాష్ట్ర కమిటీ జాబితాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...