GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 7:24 pm Posted by : GARUDA DHATRI NEWS

ఏపీ డిప్యూటీ సీఎం పై తెలంగాణ పార్టీ నేతల విమర్శలు పై స్పందించిన చంద్రబాబు

పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీల నేతల విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

• రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు ఉపయోగించుకునేలా యోగాంధ్ర పోర్టల్

• నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద… దానిని అంతా అందిపుచ్చుకోవాలి.

• ఏపీలో చేస్తున్న ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది… ఈ విజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందించేలా చర్యలు చేపడుతున్నాం.

• భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా.

• జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్.

• శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా.

• యోగాను మన జీవన విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం.
• ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

• *రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం.*

• ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ‘Yoga for Healthy Aging’.

• వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే థీమ్ ఉద్దేశం.

• ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలి.

• ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలి.

• ఈసారి యోగాంధ్ర 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతేడాది స్ఫూర్తిని కొనసాగించాలి.

• *జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం.*

• *అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్టానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తాం.*

• *ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్‌ నిర్ణయించాం.*

• *ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో కార్యక్రమాలు నిర్వహిస్తాం.*

• *ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది పాల్గొనే కార్యక్రమాలు నిర్వహిస్తాం.*

• *రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా-టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.*

• *ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి చారిత్రక ప్రాంతాలు వేదికలుగా ఈ యోగా కార్యక్రమం చేపడుతున్నాం*

• యువతలో, మహిళల్లో, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం.

• స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నాం.

• రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేస్తాం.

• ప్రస్తుతం ఉన్న ట్రైనర్ల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టాం.

• యోగాంధ్ర-2026 విజయవంతం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాం.

• జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, నిర్వహణ ఏర్పాట్లకు ఈ నిధులు వినియోగిస్తాం.

• అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాం.

• యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగిస్తాం.

• రాష్ట్రంలో ఒక కోటి మంది క్రమం తప్పకుండా యోగా చేసేలా చర్యలు తీసుకుంటాం.

• ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ చేపడుతున్నాం.

• జూన్ నెల మొత్తాన్ని ‘యోగా నెల’గా ప్రకటించాం.

• దీనిని సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి సాయం తీసుకుంటున్నాం.

• ప్రతి ఇంటికి యోగా చేరేలా మంతెన సత్యనారాయణ రాజు ప్రత్యేక వీడియోలు రూపొందించారు.

• సాధారణ యోగా ఆసనాలు, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగా సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కు పైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

• సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్స్ ఉచితంగా ప్రజలకు చేరువ చేయాలి.

• *వాట్సాప్ నంబర్‌ 81424 04888 కు ‘Hi’ అని మెసేజ్ పంపిస్తే యోగా వీడియోలు వస్తాయి.*

• స్కూళ్లు, కాలేజీల్లో యోగాను చదువులో భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

• చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దగలం.

• *యోగాంధ్ర-2026 కోసం యోగాంధ్ర పోర్టల్‌ను ప్రారంభించాం.*

• *yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది.*

• మహిళలు, విద్యార్ధుల్లో యోగాపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం.

• ఈ కార్యక్రమాన్ని సంజీవని ప్రాజెక్టుకు కూడా లింక్ చేసేలా చర్యలు చేపడుతున్నాం.

• ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్, బ్రహ్మకుమారీస్, దాజీ, బాబా రామ్ దేవ్ లాంటి విశిష్ట వ్యక్తుల భాగస్వామ్యం తీసుకుంటున్నాం.

• ప్రకృతి ఆశ్రమం నిర్వహిస్తున్న మంతెన సత్యనారాయణ రాజు సేవలు కూడా వినియోగించుకుని యోగాను ఇంటిగ్రేట్ చేస్తాం.

• మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యోగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ చేపడుతున్నాం.

• గత ఏడాది యోగాంధ్ర కార్యక్రమంతో దేశం, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశాం.

• విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన యోగాంధ్రతో రికార్డులు సృష్టించాం.

• 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులతో పాటు స్కోచ్ అవార్డు రాష్ట్రానికి వచ్చాయి.

• గతేడాది 2.44 కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకున్నారు.

• 1.91 కోట్ల మందికి సర్టిఫికెట్లు అందించాం. 1.33 లక్షల వేదికలపై 1.53 లక్షల మంది ట్రైనర్లతో నిర్వహించాం.

• 2.18 కోట్ల మంది వెల్‌నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారు.

• తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదు.

• ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు.

• విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు.

• ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు.

• నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను.

• తమిళనాడుకు కర్నాటకతో పాటు ఆలిండియా నేతలతో పాటు అన్ని ప్రాంతాల నేతలు వచ్చారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు.

• తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది.

• బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు. విస్తరిస్తాం అన్నారు.

• మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు.

• అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు.

• ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారు.

• ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో… వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారు.

• అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.

• గొడ్డలి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు.

• ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు బహిష్కరించాలి.

• అసత్యాన్ని పదేపదే చెబితే ప్రజలు విశ్వసిస్తారని కొందరు అనుకుంటున్నారు.

• డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకానికి టీడీపీ ఓ బ్రాండ్.

• ఎన్నికల్లో ప్రకటించి అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి అత్యంత కట్టుదిట్టంగా నియామకాలు చేపట్టాం.

• స్పోర్ట్ కోటాలో అక్రమాలు అంటున్నారు. కానీ వారికి క్రీడల్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారు.

• కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన కేటగిరీల ఆధారంగా ఈ ఉద్యోగాలు వచ్చాయి.

• వాళ్ల పేటిఎం బ్యాచ్ ల ద్వారా లేని పోని దుష్ప్రచారం చేస్తున్నారు.

• కొందరు చేస్తున్న దద్దమ్మ పనులకు ప్రజలు ఇబ్బందులు పడాలా…?

• పారదర్శకంగా చేసిన నియామకాలపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు.

• బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి ఆ తర్వాతే మాట్లాడాలి.

• సాక్ష్యాలు, నిజాలతో అసెంబ్లీలో గట్టిగా పోరాడిన ఘటనలు ఉన్నాయి.

• కొందరు ఏదేదో మాట్లాడేసి బురద చల్లుతామంటే ఎవరు విశ్వసిస్తారు..?

• యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించాం. దీనిపైనా విమర్శలు చేయటం ఏమిటి..?

• ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్మాణాత్మక నిర్ణయమైనా దానిపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు.

• దీనికి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం తప్ప మరోమార్గం లేదు.

• ప్రజలకు మంచి చేయటంలో పోటీ పడాలి తప్ప. ప్రజల మధ్య విబేధాలు తేవటం సరికాదు.

• విభజన జరిగి 12 ఏళ్ల సమయం గడిచిపోయింది. ప్రజలకు ఎవరు మంచి చేశారన్నది అందరికీ తెలుసు.

• ఈ అభివృద్ధిని లాజికల్ గా తీసుకెళ్లాలి. అనసవరంగా వివాదాలు సృష్టించటం ఎవరికీ మంచిది కాదు.