GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 6:24 am Digital Edition : GURU SWAMY

ఓజిలి మండల నూతన తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన మిట్టపల్లి అశోక్ రెడ్డి

ఓజిలి మండల నూతన తహసిల్దార్‌గా మిట్టపల్లి అశోక్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సంద ర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.భూసంబంధిత సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానన్నారు.కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మండల అభివృద్ధికి అందరి సహకారం అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.