ఓటరు జాబితా సవరణపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం
-SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూరపాటి శంకర్ రెడ్డి పిలుపు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు వరదయ్యపాలెంలోని KBG కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో...