చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 01 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపల్ ఎన్నికలలో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం కుప్పం మున్సిపాలిటీకి చైర్మన్ మరియు కౌన్సిలర్లకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి సి నాగరాజు కుమారుడు డాక్టర్ సునీల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైందేనని అన్నారు.