GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:30 pm Posted by : GURU SWAMY

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరే విధంగా చొరవ చూపాలి

-గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్- ఆంధ్ర ప్రదేశ్*అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పిబి బాలసుబ్రమణ్యం

పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) :
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పంపి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి పి బీ బాలసుబ్రమణ్యం కోరారు. జిల్లా కలెక్టరేట్ లో చిత్తూరు జిల్లాలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో జిల్లా రెవెన్యూ అధికారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన హాజరైన అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పిబి బాలసుబ్రమణ్యం జిల్లా అధ్యక్షులు యస్ జ్ఞాన శేఖర్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ కోశాధికారి రెడ్డి గోపాల్ తదితరులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ కు అందజేసి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు కె.వి రాఘవులు, ప్రధాన కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో సమావేశానికి హాజరై డిఆర్వోకు వినతిపత్రం సమర్పించడమైనది.