GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:27 am Digital Edition : GURU SWAMY

కడసారి చూపుకు తరలివచ్చిన జన సందోహం

* గుండెపోటుతో ఆసుపత్రి చంద్రన్న మృతి.
* చంద్రన్న కుటుంబానికి అండగా ఉంటాం-టిడిపి నేతల వెల్లడి.
* చంద్రన్న అమర్ రహే అంటూ నినాదాలు.
* భౌతికకాయంపై టిడిపి జెండాతో నివాళులర్పించిన నేతలు.
కుప్పం,ఆగస్టు 10 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధి లోని విజయలక్ష్మి రోడ్డు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రన్న అనే చంద్రశేఖర్ ను కడసారి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఆసుపత్రి చంద్రాగా పేరు పొందిన చంద్రశేఖర్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని ఇంటి వద్ద కడసారి చూసేందుకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఆస్పత్రిలో ఉద్యోగిగా సేవలు అందిస్తూ రిటైర్డ్ అయి ఉన్నారు. దీంతో కుప్పం నియోజకవర్గంలోనే కాకుండా పలమనేరు నియోజకవర్గంలో సైతం ఆయన చాలామందికి సుపరిచితుడు. ఆయన కుమారుడు కార్తీక్ కుప్పంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో కడసారిగా ఆయనను చూసేందుకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు ఇంటి వద్దకు చేరుకొని నివాళులర్పించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో తరలివచ్చి చంద్రన్నకు నివాళులర్పించారు. చంద్రన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. చంద్రన్న భౌతికకాయం పై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ, చంద్రశేఖర్ కు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం అని అన్నారు. ఈ కష్టకాలంలో చంద్రశేఖర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రశేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజు, కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ సునీల్ రాజ్, కుప్పం డిగ్రీ కాలేజ్ సెక్రటరీ సాగర్ రాజ్, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ బాబు, ఎస్. చౌడప్ప, ఆర్, చంద్రశేఖర్, బేటప్ప నాయుడు, హేమాంబర గౌడు, సుబ్రమణి, వెంకటేష్,రాజ్ కుమార్, సత్యేంద్ర శేఖర్ ,రవి, డాక్టర్ వి. వెంకటేష్, సోమశేఖర్, దామోదరం నాయుడు, జాకీర్, రవి, ఆర్.శ్రీనివాసులు, జయమ్మ, తిరుమగల్, సెల్వరాజు, కే.ఎం. వేణుగోపాల్, ఇంకా పలువురు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతాపం వ్యక్తం చేశారు.