GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:53 pm Digital Edition : GURU SWAMY

కనకనాచారమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించండి

* కడపిడి వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం.
కుప్పం,జులై 31 (గరుడ ధాత్రి న్యూస్): కంగుంది పంచాయతీలోని శ్రీ కనక నాచారమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం లు ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.కుప్పం మండలం పెద్దవంక సమీపంలో సోమవారం నిర్వహించనున్న శ్రీ కనక నాచారమ్మ జాతర సందర్భంగా కడా కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్*నియంత్రణ, వైద్య సేవలు, భద్రతతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. ఈ సమీక్షలో డిఎస్పీ పార్థసారథి, కడ సలహా మండలి సభ్యులు రాజకుమార్, కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్, అధికారులు పాల్గొన్నారు.