GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:41 am Digital Edition : GURU SWAMY

కన్నులపండువగా వివిధ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4

బైరెడ్డిపల్లి మండలం లో శుక్రవారం వివిధ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా కొనసాగింది. బైరెడ్డిపల్లి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ కృష్ణ భాగవానుడి చిత్రపటం కు విశేష అలంకారంలో తీర్చిదిద్ది అర్చకులు రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో విశేషపూజలు చేపట్టారు.ఈ సందర్భంగా కళసస్థాపన, గోపూజ, శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజలు, మహా మంగళ హారతి చేపట్టారు.శ్రీకృష్ణుడుకి ఇష్టమైన వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు.ఈ కార్యక్రమంకు ఉభయదారులు గా దిండుకుర్తి శ్రీమతి ఉష మరియు గోపాల కృష్ణమూర్తి కుటింబీకులు వ్యవహరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని బేలుపల్లి లో వ్యవసాయ పొలాల వద్ద నెలకొని ఉన్న అతి పురాతన శ్రీ కృష్ణ ఆలయంలో అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసచార్యుల బృందం మూలవర్లకు పంచామృత అభిషేకం,విశేషపూజలు చేపట్టి మహామంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండలంలోని రామనపల్లి లో కల వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు పార్థసారథి స్వామి చే శాస్త్రోక్తంగా అభిషేకం, విశేష పూజలు, గోపూజ కార్యక్రమం లు చేపట్టారు.ఈ సందర్భంగా చిన్నారులుచే పట్టిన వేషధారణ భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు,వివిధ ఆభరణాలు,, పుష్పాలతో అలంకరించి అలయంచుట్టు ప్రాకారోత్సవం నిర్వహించారు. మండలంలోని దాసార్లపల్లి లో యాదవకులస్థులు చే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడి విగ్రహం ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విశేష పూజలు, అభిషేకం చేపట్టారు.సాయంత్రం ఉత్సమూర్తులను పల్లకిలో ఆశీనులుచేసి గ్రామపురవీధుల్లో భక్తుల కోలాహలం తో స్వామిని ఊరేగించారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.