కన్నుల పండువగా నాయి బ్రాహ్మణులచే బంగారు గొడుగు ప్రతిష్టాపన

తిరుపతి, మే 29 గరుడధాత్రి : శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి రథంపై నాయి బ్రాహ్మణులచే వంశపార్యపరంగా బంగారు గొడుగు ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. వంశపారంపర్యంగా సాంప్రదాయ బద్ధంగా బంగారు గొడుగు సమర్పిస్తూ వస్తున్న ధర్మకర్త పంతులు రామనాథన్ ఆధ్వర్యంలో బంగారు గొడుగుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ బంగారు గొడుగును నాలుగు మాడా వీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకుని వచ్చి అనంతరం గోవిందరాజ స్వామి...