కన్నుల పండువగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) : పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి, అమ్మవార్లను కమనీయమైన బంగారు కవచాలతో అలంకరించారు. సుగంధ ద్రవ్యాలు,...