కపిలతీర్థంలో దివ్య చక్రస్నానం..
భక్తి తరంగాల్లో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు స్నపన తిరుమంజనంతో ఆధ్యాత్మిక వైభవం ధ్వజావరోహణంతో నేడు బ్రహ్మోత్సవాలకు మంగళం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంతో పరమపవిత్రంగా ముగిశాయి. కపిలతీర్థం ఆళ్వార్ తీర్థం వద్ద జరిగిన ఈ దివ్య ఘట్టాన్ని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి పుణ్యఫలాన్ని పొందారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్ ఆలయం నుండి మంగళవాద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య...