GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:05 pm Posted by : GARUDA DHATRI NEWS

కమ్మనపల్లి గురుకుల హాస్టల్‌లో వంట సిబ్బంది నియామకం

బైరెడ్డిపల్లి గరుడధాత్రి జూన్ 14: బైరెడ్డిపల్లి మండలంలోని కమ్మనపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్‌లో వంట సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ భార్గవి తెలిపారు.
హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు వంటవారు (కుక్స్), ఇద్దరు సహాయకులు (హెల్పర్స్) మొత్తం నలుగురు సిబ్బందిని అత్యవసరంగా నియమించనున్నట్లు ఆమె వెల్లడించారు. వంట పనుల్లో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక నిరుద్యోగ యువత, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేతనం, విధుల సమయం, ఇతర అర్హతలు తదితర వివరాల కోసం నేరుగా పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ భార్గవి ఒక ప్రకటనలో తెలిపారు.