కమ్మనపల్లి గురుకుల హాస్టల్‌లో వంట సిబ్బంది నియామకం
బైరెడ్డిపల్లి గరుడధాత్రి జూన్ 14: బైరెడ్డిపల్లి మండలంలోని కమ్మనపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్‌లో వంట సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ భార్గవి తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు వంటవారు (కుక్స్), ఇద్దరు సహాయకులు (హెల్పర్స్) మొత్తం నలుగురు సిబ్బందిని అత్యవసరంగా నియమించనున్నట్లు ఆమె వెల్లడించారు. వంట పనుల్లో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక...