కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు న్యాయం చేయాలి
సత్యవేడులో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా సత్యవేడు, సెప్టెంబర్ 23 గరుడధాత్రి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాండీ అరుణాచలం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారం కోసం...