GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:39 pm Posted by : GURU SWAMY

కలిగుట్ట గ్రామంలో యోగ ఆంధ్ర కార్యక్రమం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16

బైరెడ్డిపల్లి మండలం లోని మారుమూల అటవీ సమీపంలో నెలకొని ఉన్న
కలిగుట్ట గ్రామం ఉన్నది.ఈ గ్రామంకు స్వాతంత్రం వచ్చి నప్పటి నుండి మట్టి రోడ్డు గుంతలు మయమై నడకదారి మాత్రమే నెలకొని అభివృద్ధి కి నోచుకోలేదు. ఇటివలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 5 కిలోమీటర్లు సిమెంట్ రహదారి ఏర్పటు చేయడంతో గ్రామస్థుల ఆనందంకు అంతులేక సంబరపడ్డారు. గతంలో గర్భిణులు చికిత్సకోసం ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నేడు ఆదుస్థితి రహదారి ఏర్పాటుతో మంగళం పాడినట్లు అయినది.
ఈ గ్రామంలో యోగ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ పారిజాతం స్కూల్ నందు పిల్లలకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారిణి సావిత్రి, పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాష్, పోషకాహారం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించడం జరిగినది.సి.హెచ్.ఓ. మౌనిక యోగ ధ్యానం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయరాలు ప్రేమ మునిరత్నమ్మ ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.