కళాశాల కాఫౌండ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి: సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం సోమవారం పిచ్చాటూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల భద్రతకు కాంపౌండ్ వాల్ ఎంతో అవసరమని పేర్కొంటూ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై పనుల పురోగతి, కళాశాల అవసరాలు, విద్యార్థులకు...