– దళిత గిరిజనుల సమస్యలు అధికారులు పట్టించుకోరా..?
– సామాజిక శంఖారావం పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన ధర్నా.
నారాయణవనం ఆగస్టు 05 ( గరుడ దాత్రి న్యూస్ )కళ్యాణ వెంకటేశ్వర స్వామి భూములను పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆర్ వెంకటేష్ వై నందయ్య, ఆధ్వర్యంలో ప్రజాసంఘాల. ధర్మరాజులు ఆలయం వద్ద నుంచి ర్యాలీగా. పుత్తూరు తాసిల్దార్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సొమ్మును ప్రజల ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు ధారాధత్వం చేస్తూ పేదల పైన భారాలలోపుతూ కార్పొరేట్ కంపెనీలకు రాయతీలు కల్పిస్తూ ప్రజల సొమ్మును దారు మళ్లిస్తున్నారని విమర్శించారు.స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికే దళిత గిరిజనులకు అక్క ఇల్లు ఇంటి స్థలాలు స్మశానాలు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం భూములన్ని ధనవంతులు భూస్వాముల గుప్పెట్లోనే ఉన్నాయని ఆవేదన చెందారు కూడా సవరించి 25 ఎకరాలకు పరిమితం చేసి ధనవంతుల దగ్గర ఉన్న భూములు పంచాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం గతంలో ఉన్న మహాత్మా గాంధీ పేరుతో ఉన్న గ్రామీణ హామీ పథకాన్ని రద్దుచేసి వి.బిజి రాంజీ పేరుతో 125 రోజులు పని కల్పిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి తొంబై శాతం కేంద్రం గ్రాంట్ గా ఇస్తున్న నిధులను 60% తగ్గించి 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలపై వేయడం వల్ల రాష్ట్రాలు మరింత అప్పుల ఊబిలో కోరుకునే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.క్రమంగా ఏ పథకం అమలకు నోచుకోకుండా పోతుందని తెలిపారు.ఈ ధర్నాకు మద్దతుగా విచ్చేసిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో దళిత గిరిజనుల సమస్యలు అంటేనే అధికారులు పట్టించుకోవడంలేదని తీవ్రంగా విమర్శించారు ఏ గ్రామంలో చూసిన స్మశానాల సమస్య స్మశానాలకు దారులు సమస్య సాగు భూముల సమస్య ఇంటి స్థలాల సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం సూపర్ సెక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ కూడా మూడు సెంట్లు ఇంటి స్థలాలకు ఇస్తామన్న హామీ అమలు కాలేదని తెలిపారుకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు1500 రూపాయలు ఇస్తామన్న హామీ కూడా అమలు కాలేదు అన్నారు నిరుద్యోగ భృతి కూడా అమలు కాలేదని తెలిపారు.అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటేష్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై నందయ్య లు మాట్లాడుతూ. తొర్రూరు దళితుల స్మశానం నీకి దారి లేదు కాలువ పోరంబోకు ఆక్రమించారు.ఈశ్వలాపురం ఏఏ డబ్ల్యూ .కాలనీకి స్మశాన స్థలామే లేదు. బొజ్జనత్తం ఎన్టీఆర్ కాలనీ కి స్మశానానికి స్థలం సరిహద్దు చూపాలి స్కెచ్ ఇవ్వాలి ఎస్టీలకు ఇంటి పన్ను ఒక్కొక్కరికి 1000 రూపాయలు పైగా వేస్తున్నారు, గోపాలకృష్ణ పురం ఎస్టీ కాలనీకి స్మశానం స్థలం అక్రమణాలు కు గురైన ఉన్న అక్రమాలు తొలగించాలని, పిల్లారిపట్టు స్మశానానికి దారి లేదు 500 మీటర్లు దూరం ఉంటుంది, ముట్టి గాని సత్రం దళిత కాలనీకి స్మశానం లేదని కాలువలో పూడుస్తున్నారు, ఇల్లు పై ఉన్న 11 కెవి విద్యుత్తు లైన్ తొలగించాలని, మొగిలి అమ్మ ఎస్టి కాలనీ కి దారి ఏర్పాటు చేయాలని స్మశానం కావాలని వీధిలైట్లు లేవు ఇంటి స్థలాలు ఇవ్వాలి తాగునీటి సమస్య ఉంది, గోపాలకృష్ణ పురం కళ్యాణం వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న 860. ఎనిమిది వందల అరవై ఎకరాలు భూమిని, దళితులకు గిరిజనులకు పంచాలి కొందరు దౌర్జన్యంగా, 202 ఫైమాసి నంబరు, కోర్టులో కేసులు నడుస్తున్నాయని వివరించారని. అన్నారు.పుత్తూరు మండలంలో ఎప్పటికీ స్మశానాలు లేని గ్రామాలు నాలుగైదు వరకు ఉన్నాయని అన్నారు.ఉన్న స్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన చెందారు. కొన్ని స్మశానాలకు దారులు లేవని తెలిపారు.అధికారులు స్పందించకపోతే కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తలారి బాలకృష్ణ సంఘం నాయకులు విజయ్ ముని శంకర్ హరిబాబు పాల్గొన్నారు. .