కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం

*చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. వెంకటేగౌడు* బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్8 వైకాపా కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం ఇస్తామని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. వెంకటేగౌడు పేర్కొన్నారు. ఆయన జిల్లా రథసారధిగా నియామకం అయిన తరువాత బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామం కు గురువారం విచ్చేయగా మండల ముఖ్య నాయకులు,వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికి పూలమాలలు,శాలవులతో సత్కరించి ఆయనను అభినంధించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తీర్థం గ్రామం పార్శం కృష్ణవేణమ్మ కళ్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన...