GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:27 am Digital Edition : GURU SWAMY

కాణిపాకంలో కన్నులపండుగగా ఎమ్మెల్యే మురళీమోహన్ జన్మదిన వేడుకలు

పూతలపట్టుఆగస్టు1(గరుడరాత్రిన్యూస్)

కాణిపాకంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలుశనివారం కన్నులపండుగగానిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం లోని పూతలపట్టు ఐరాల తవణం పల్లె బంగారుపాళ్యం యాదమరి మండలాలకు చెందిన కన్వీనర్లు నాయకుల ఆధ్వర్యంలో కాణిపాకం బాలాజీ కళ్యాణ మండపంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఉదయం తిరుపతి నుండి ఎమ్మెల్యే కాణిపాకం కు బయలుదేరారు పి కొత్తకోట. రంగంపేట క్రాస్. పాల కూరు. మద్దిపట్ల పల్లె. తదితర గ్రామాల్లో ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దారిపొడిన ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే కి ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.కాణిపాకంవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని కళ్యాణ మండపంలో బర్తడే వేడుకలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు.జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముఖం. కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు. సీకే లావణ్య.ప్రజా ప్రతినిధులు అధికారులు అభిమానులుప్రజలుపాల్గొని భారీ కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యేకి తినిపించే జన్మదినశుభాకాంక్షలుతెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా బర్త్ డే వేడుకలు ప్రజాప్రతినిధుల ప్రజలు అధికారుల మధ్య జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం అని నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమే నేను ఎమ్మెల్యే అయ్యానని మా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపాడు. ప్రజలు నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నా మిత్రుడు మురళీమోహన్ మాటల మాంత్రికుడని ఆయన ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపాడు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుచిత్ర కన్నా నాయుడు. మాజీ జెడ్పిటిసి లతా. పూతలపట్టు నియోజకవర్గం కన్వీనర్లు దొరబాబు చౌదరి. గంగార పారిబాబు నాయుడు. వెంకటేశ్వర చౌదరి. ఎన్ పి ధరణి చౌదరి. మొరార్జీ యాదవ్. వేము కళాశాల అధినేత డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు. నాయకులు మధుసూదన్ రావు. నరసింహనాయుడు. హేమాద్రి నాయుడు. నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు