GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:58 pm Digital Edition : GURU SWAMY

కాణిపాకంలో కామధేను వాహనంలో దర్శనమిచ్చిన గణనాథుడు

కాణిపాకం అక్టోబర్ 2(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కామదేను వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం నాయీబ్రాహ్మణ సంఘం కాణిపాకం వారి ఆధ్వర్యంలో దేవస్థానం కల్యాణ కట్ట నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిఉత్సవమూర్తులకు అభిషేకంనిర్వహించారు. రాత్రి కళ్యాణ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయం నుండి కామధేను వాహన పైకి తీసుకువచ్చి వాహనంపై పూరేగించారు ఉభయదారులుగా నాయి బ్రాహ్మణులు వ్యవహరించారుఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్.చైర్మన్ మనీ నాయుడు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సునీత, సుబ్బారెడ్డి, వసంత. కృష్ణవేణి. మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి. మాజీ ఎంపీపీ రవి ప్రసాద్.ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, కామధేను వాహన ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.