భక్తులకునాలుగు గంటలకే సర్వదర్శనం
రాష్ట్రమంత్రిరామనారాయణ రెడ్డిచే స్వామివారికి పట్టు వస్త్రాలు
భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమాలు
-ఈవో పెంచల కిషోర్
-చైర్మన్ మణి నాయుడు
కాణిపాకం సెప్టెంబర్ 13 గరుడధాత్రి న్యూస్ :
నేటి నుండి జరిగే కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చేభక్తులకు.ఉభయదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామనికార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్. పాలక మండలి చైర్మన్ మణి నాయుడు తెలిపారు. గురువారంబ్రహ్మోత్సవాలపై మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. బుధవారం అర్ధరాత్రి నుండి ఉబయదారులచే రెండు పర్యాయంలో స్వామివారికి అభిషేకలు నిర్వహిస్తారని. గురువారం ఉదయం నాలుగు గంటల నుండి భక్తులకు సర్వ దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.బ్రహ్మోత్సవాలు సందర్భంగా అన్ని ఆర్చిత సేవలు అంత్రాలయ దర్శనం. నిలిపివేయడం జరిగిందని. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది ఓపికతో మాట్లాడి దర్శనాలను చేయించాలన్నారు.రోజుకు 50, వేలుమంది పైగా స్వామివారిని దర్శించుకొనున్నారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. వచ్చేప్రతి భక్తుడికి అన్న ప్రసాదాన్ని ఉదయం 11 గంటల నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ప్రసాదాలు ప్రతి భక్తునికి అదే విధంగా ప్రసాదాలను తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు జరిగే స్వామివారి ఉత్సవాల ఊరేగింపులు రాత్రి 7.8. మధ్యలో బయలుదేరి రాత్రి 12: గంటలకు కల్లా ఆలయంలోకి చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యము ఆలయము లోపల బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ బస్సులు కూడా రాత్రి 12 గంటల వరకు సర్వీసులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యానికి తెలిపామన్నారు. నేటి నుండి 21 రోజులు అక్టోబర్ 4 జరిగే బ్రహ్మోత్సవాలకు ఉభయ దారులు సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను పూర్తి చేస్తామని తెలిపారు. రాధోత్సవం. పుష్ప పల్లకి సేవ.తేప్పోత్సవం కు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జరిగే మీ సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు