కాణిపాకం, ఆగస్టు 9 (గరుడధాత్రి న్యూస్):
హైదరాబాద్‌కు చెందిన ఓం సాయి మోటార్స్ అధినేత నీలిమ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలోని నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నీలిమకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.