GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:26 pm Digital Edition : GURU SWAMY

కాణిపాకం పరిశుద్ధుని సేవలో రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ జయలక్ష్మి

కానిపాకం అక్టోబర్ 2 (గరుడదాత్రిన్యూస్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA), జయలక్ష్మి కుటుంబ సమేతంగా గురువారం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా శ్రీయుత కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్.చైర్మన్ శ్రీ మణి నాయుడు ఈకార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు వసంత, చిత్తూరు ఆర్డీవో, శ్రీనివాసులు ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, ఎస్సై నర్సింహులు.రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.