కాణిపాకం అక్టోబర్ 1 గరుడధాత్రి :
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు మంత్రికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణవేణి, వసంత, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు, సీఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్సై, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, చిత్తూరు వ్యవసాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.