కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

కాణిపాకం అక్టోబర్ 1 గరుడధాత్రి : స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు మంత్రికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణవేణి, వసంత, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు, సీఐ...