GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:11 am Digital Edition : GURU SWAMY

కారు ఢీకొని వృద్ధ వ్యాపారి కి తీవ్ర గాయాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్31

బైరెడ్డిపల్లి లో పుంగనూరు రహదారిలో శనివారం కారు వృద్హ వ్యాపారిని ఢీకొన్న సంఘటన చోటుచేసుకున్నది.
పుంగనూరు రహదారిపై న శనివారం గొర్రెల సంత ప్రతి వారం జరుగుతున్నందున ఈ రహదారి వ్యాపారులు,గొర్రెలు తో క్రిక్కిరిసి వాహన రాకపోకలు కు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం మాములే. గ్రామ పంచాయితీ వారు ప్రజలకు ఇబ్భంధులు ఎదురుఅవ్వకుండా మరో ప్రదేశంలో గొర్రెల సంత నిర్వహణకు చొరవ చూపక నిర్లక్ష్యం వల్ల తరచు ప్రమాదం లో నెలకొంటుంది. శనివారం రహదారిలో పలమనేరు కు చెందిన రామయ్య కోళ్ల వ్యాపారం చేసుకొంటుండగా కారు ఆయనను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 వాహన సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భాధితుడిని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇకనైనా పశువుల సంత ను మరో ప్రాంతంకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుకొంటున్నారు.