కారు ఢీకొని వృద్ధ వ్యాపారి కి తీవ్ర గాయాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్31 బైరెడ్డిపల్లి లో పుంగనూరు రహదారిలో శనివారం కారు వృద్హ వ్యాపారిని ఢీకొన్న సంఘటన చోటుచేసుకున్నది. పుంగనూరు రహదారిపై న శనివారం గొర్రెల సంత ప్రతి వారం జరుగుతున్నందున ఈ రహదారి వ్యాపారులు,గొర్రెలు తో క్రిక్కిరిసి వాహన రాకపోకలు కు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం మాములే. గ్రామ పంచాయితీ వారు ప్రజలకు ఇబ్భంధులు ఎదురుఅవ్వకుండా మరో ప్రదేశంలో గొర్రెల సంత నిర్వహణకు చొరవ చూపక నిర్లక్ష్యం వల్ల తరచు ప్రమాదం లో నెలకొంటుంది. శనివారం రహదారిలో పలమనేరు కు చెందిన రామయ్య...