కారూర్‌లో ఆపరేషన్ త్రిశూల్ అవగాహన కార్యక్రమం
పిచ్చాటూరు, గరుడధాత్రి: పిచ్చాటూరు మండలం కారూర్ గ్రామంలో ఎస్సై బి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. రాఘవేంద్ర మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు రసాయనాలకు అడ్డుకట్ట వేయడం, మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణే ఆపరేషన్ త్రిశూల్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల...