కార్తికేయన్ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం
• భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత సురుటపల్లి పంచాయతీ కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రవి,జయ దంపతుల కుమారుడు తొమ్మిదవ తరగతి విద్యార్థి కార్తికేయన్ గతవారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఉదయం కస్తూరినాయుడు కండ్రిగ గ్రామానికి చేరుకుని కార్తికేయన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు....