కార్మిక సంఘాల పోరాట ఫలితం.. సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం

వరదయపాళ్యెం, ఆగస్టు 14 గరుడధాత్రి న్యూస్: వరదయ్యపాలెం మండలంలోని డిపి చాక్లెట్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బుచ్చినాయుడుకండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన కార్మికుడు సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తూ చేపట్టిన పోరాటం నేపథ్యంలో గురువారం యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. సునీల్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కార్మిక సంఘాల...