కార్వేటి నగరం సెప్టెంబర్ 24 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మేజర్ పంచాయతీలో స్వచ్ఛతి సేవ కార్యక్రమంలో భాగంగా దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధించాలంటూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు వాడడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు. అక్టోబర్ రెండో తేదీ లోపల ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని దుకాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది హరితరాయబాలు పాల్గొన్నారు.