కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడధాత్రి :
కార్వేటినగరం సింగిల్ విండోలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి సీఈఓ దుష్యంత్ రెడ్డిపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. చిత్తూరులో బుధవారం డీసీసీబీ చైర్మన్ అమరరాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ మీటింగ్ జరిగింది. చైర్మన్‌తో పాటు డీసీఓ లక్ష్మి, బ్యాంకు సీఈఓ శంకర్బాబు, సభ్యులు పాల్గొన్నారు. కార్వేటినగరం విండో సీఈఓ దుష్యంత్ రెడ్డిపై జూన్-జూలై నెలలో అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో అప్పట్లో డీసీసీబీ విచారణకు ఆదేశించగా, నివేదిక వచ్చింది. రైతులకు నగలపై తక్కువ వడ్డీకి రుణాలను ఈయన కుదువ వ్యాపారులకు అధిక మొత్తాలకు ఇచ్చినట్లు ఫిర్యాదు అందింది. నగలపై గరిష్టంగా రూ.6 లక్షల వరకు రుణాలిచ్చే అవకాశమున్నా రూ.కోటికి మించి ఇచ్చినట్లు తెలిసింది. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్మిన డబ్బును ఆలస్యంగా బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సమాచారం. ఇవే కాక మరికొన్ని ఆరోపణలపై బుధవారం డీఎన్‌పీసీ కమిటీ సుదీర్ఘంగా చర్చించి సీఈఓ దుష్యంత్ రెడ్డిపై సస్పెన్షన్‌కు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఇంచార్జ్ సీఈవోగా నరేష్ అప్పగించారు. గత సీఈవో చేత నగదు మరియు నగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని లాకర్లు ఉంచడం జరిగింది.